Telangana : నేటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం
తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి
తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 783 పోస్టుల భర్తీ కోసం రెండు రోజుల పాటు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈరోజు, రేపు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం టీజీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశఆరు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓఎంఆర్ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5.50 లక్షల మంది...
ఈ పరీక్షకు సంబంధించి 783 పోస్టుల కోసం 5.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్క ప్రశ్నాపత్రం 150 మార్కులతో ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్ష నిరవహించనున్నారు. గ్రూప్ 2 పరీక్షలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యామ్నం 12.30 గంటలకు ముగియనున్నాయి. అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై 5.30 గంటల వరకూ జరగనున్నాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాల తలుపులు మూసివేస్తామని అధికారులు చెబుతున్నారు. నిమిషం ఆలస్యమయినా లోపలికి అనుమతించమని అధికారులు తెలిపారు.