Big Breaking : బీఆర్ఎస్ కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు నిధులు జమ చేయడానికి అనుమతిని వెనక్కు తీసుకుంది.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు నిధులు జమ చేయడానికి అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కు తీసుకుంది. నాలుగు రోజుల క్రితం రైతు బంధు పథకం కింద నిధులు విడుదల చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. పాత పథకం కావడంతో నిధులు విడుదల చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంది.
హరీశ్‌రావు ప్రకటనతో....
అయితే వరసగా సెలవులు రావడంతో ఈరోజు రేపు రైతు బంధు నిధులను విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందు రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను జమ చేయడానికి వీలులేదని పేర్కొంది. ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.