Breaking : ఐఏఎస్‌లకు ఝలక్ ఇచ్చిన కేంద్రం
తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పదకొండు మంది ఐఏఎస్ లను సొంత రాష్ట్రాలకు వెళ్లాలని తెలిపింది
తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పదకొండు మంది ఐఏఎస్ లను సొంత రాష్ట్రాలకు వెళ్లాలని తెలిపింది. తమకు తెలంగాణ క్యాడర్ కావాలని కోరిన ఐఏఎస్ అధికారుల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. తిరస్కరించింది. వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలని కోరింది. వెంటనే సొంత రాష్ట్రాలకు వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఏపీకి రిపోర్టు చేయాలని...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి, విద్యుత్ శాఖ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ లు ఇందులో ఉన్నారు. వీరంతా ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం పదకొండు మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది.