నేడు కాంగ్రెస్ చలో రాజ్‌భవన్
కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా చలో రాజ్ భవన్ కు పిలుపు నిచ్చింది
కాంగ్రెస్ పార్టీ నేడు చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా చలో రాజ్ భవన్ కు పిలుపు నిచ్చింది. ఈ పిలుపు మేరకు తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ కు పిలుపు నిచ్చారు.
తెల్లవారు జామునే...
అయితే తెల్లవారు జామునే ఎన్ఎస్‍యూఐ కార్యకర్తలు రాజ్ భవన్ ను ముట్టడించారు. రాజ్ భవన్ గేటు వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొందరు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.