ఇక వీరికి కూడా కష్టమే

చికెన్, మటన్ వ్యాపారులకు పెద్ద కష్టం వచ్చింది. చికెన్, మటన్, ఫిష్ వంటి దుకాణాలు సంబంధిత వృత్తి వారు నడుపుకుంటున్నారు.

Update: 2021-11-28 02:20 GMT

చికెన్, మటన్ వ్యాపారులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఇప్పటి వరకూ చికెన్, మటన్, ఫిష్ వంటి దుకాణాలు సంబంధిత వృత్తి వారు నడుపుకుంటున్నారు. చిన్న, పెద్ద దుకాణాలతో తమ జీవనం గడుపుకుంటున్నారు. ఇక ఇందులో కూడా కార్పొరేట్ సంస్థలు కాలుమోపుతున్నాయి. దాదాపు ఏడు కార్పొరేట్ సంస్థలు ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి.

నా‌ణ్యత.. తక్కువ ధర...
ఇందులో ఫ్రెష్ సరుకుతో పాటు నాణ్యతతో కూడిన చికెన్, మటన్, ఫిష్ దొరుకుతాయని ఇప్పటికే కొన్ని చోట్ల ప్రకటనలను ప్రారంభించారు. ఏసీ లో ఉండే ఈ షాపుల్లో తూకంలో కూడా ఖచ్చితత్వాన్ని పాటిస్తామని, ధర కూడా బయట కంటే తక్కువ ధరకు దొరుకుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. త్వరలో హోం డెలివరీని కూడా ప్రారంభించనున్నారు. దీంతో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. కార్పొరేట్ సంస్థలు కాలిడితే వీరికి కష్టాలు రాక తప్పవంటున్నారు.


Tags:    

Similar News