చికెన్.. చాలా కాస్ట్‌లీ గురూ!! కొండెక్కిన కోడి ధరలు
రోజురోజుకూ చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. వచ్చే వారానికి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ముక్క లేనిదే ముద్ద దిగదా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎంతో ఇష్టంగా తినే కోడికూర ఇక వండుకోవడం కొద్దిగా కష్టమే. రోజురోజుకూ పెరిగిపోతున్న చికెన్ ధరలే అందుకు కారణం. కేజీ చికెన్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ దాటేస్తోంది. కోడి ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. లైవ్ కేజీ రూ.180 క్రాస్ చేసేసింది. గత వారం రూ.260లుగా ఉన్న స్కిన్ లెస్ చికెన్ ఆదివారం, సోమవారం నాటికి మూడొందల రూపాయలకు చేరింది. అవి ఇంకా పెరిగే అవకాశముందట.
వేసవి ఉష్ణోగ్రతలు కోళ్ల పెంపకంపై పడుతున్నాయని.. దీంతో ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే ఆదివారం నాటికి చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందట! మటన్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు ఇలా పెరుగుతూ పోతే నాన్‌వెజ్ ప్రియులకు కష్టమే మరి!!