కేసీఆర్ మనవడు పట్టా అందుకుని

గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు ఆశీర్వదించారు

Update: 2023-04-19 01:58 GMT

ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, పన్నెండో క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలీలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా తాను చదువుతున్న స్కూల్ లో ‘12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే’వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు, తల్లిదండ్రులు కేటీఆర్ , శైలిమ లు, చెల్లెలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

తాత ఆశీర్వాదం అందుకుని...
గ్యాడ్యుయేషన్ డే’ సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఓక్రిడ్జ్ స్కూలు వారు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. అదే సందర్భంలో విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలను అందజేసింది. ఇందులో భాగంగా, సీఎం కేసీఆర్ మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ (సి ఎ ఎస్) విభాగంలో ప్రతిభను ప్రదర్శించినందుకు గుర్తించి, హిమాన్షు ను సీఏఎస్ విభాగంలో ఎక్స్ లెన్స్ అవార్డును అందజేశారు. గ్యాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు వెంటనే స్టేజీ దిగివచ్చి తమ తాత గారైన సీఎం కేసీఆర్ చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.


Tags:    

Similar News