ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
తెలంగాణలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను పెద్దయెత్తున నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు
తెలంగాణలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను పెద్దయెత్తున నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీన సభను జరపనున్నారు. ఖమ్మం జిల్లాలో ఆవిర్భావ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించనిట్లు తెలిసింది. ఈ సభకు పెద్దయెత్తున జనసమీకరణ చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల నేతలకు సమాచారం వెళ్లినట్లు తెలిసింది. సభను సక్సెస్ చేసే బాధ్యతను కొందరి నేతలకు కేసీఆర్ ఇప్పటికే అప్పగించారని చెబుతున్నారు.
ముగ్గురు సీఎంలతో....
ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులను కూడా కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలిసింది. దీంతో పాటు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా రానున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మినహా అందరూ సభకు వచ్చేందుకు అంగీకరించారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈరోజు విజయన్ నుంచి సభకు వస్తారా? లేదా? అన్న సమాచారం రానుంది. ఈ సభ ద్వారా ప్రజల్లోకి బీఆర్ఎస్ ను మరింత చేరువుగా తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఖమ్మం అయితే ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారని తెలిసింది.