పూర్తి ఫిట్‌తో సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నారు. ఆయనను ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నారు. ఆయనను మంత్రి శ్రీనివాసగౌడ్ కలుసుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత 24 రోజుల నుంచి కేసీఆర్ బయటకు రావడం లేదు. ఆయన వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, చాతీలో ఇన్‌ఫెక్షన్ కూడా సోకిందని మంత్రి కేటీఆర్ వెల్లడించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల కేసీఆర్ శ్రీమతి శోభ కూడా తిరుమల వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని వచ్చారు.
అభిమానుల ఖుషీ
ఈ నేపథ్యంలో ఇరవై నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ ఫొటో బయటకు వచ్చింది. ఆయనతో మంత్రి శ్రీనివాసగౌడ్ ఉన్న ఫొటో బయటకు రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫుల్లు ఖుషీ అవుతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచారాన్ని కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు నలభై సభల్లో ఆయన పాల్గొననున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.