Telangana : కష్టాలు తీరాలంటే ఈరోజు దరఖాస్తు చేయండి.. నిరుద్యోగులకు తీపికబురు

రాజీవ్ యువ వికాసం పధకం కింద నేటి నుంచి నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నారు.;

Update: 2025-03-23 04:12 GMT
rajiv yuva vikasam, applications,  unemployed, telangana
  • whatsapp icon

నేటి నుంచి ఈబీసీ నిరుద్యోగుల దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకునే వీలుంది. రాజీవ్‌ యువవికాసం కింద ఈబీసీలకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించిన నిధులను నిరుద్యోగులకు ఇవ్వనున్నారు. దరఖాస్తులు చేసుకునే కార్యక్రమం నేటి నుంచి నుంచి ప్రారంభమవుతుండటంతో తెలంణాలోని నిరుద్యోగులు తమ కష్టాలు తీర్చుకోవడానికి ఇది మంచి సమయం అని ప్రభుత్వం చెబుతుంది. అర్హులైన వారికి మూడు నుంచి ఐదు లక్షల రూపాయ వరకూ రుణం అందచేయనున్నారు. ఈ రుణంంతో చిరు వ్యాపారాలను పెట్టుకునే వీలుంది. రేపు రాజీవ్‌ యువ వికాసం పథకంపై నిబంధనలు జారీ కానున్నాయని అధికారులు తెలిపారు.

రాజీవ్ యువ వికాసం కింద..

రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు.. నిరుద్యోగులకు అండగా నిలుస్తామని, స్వయం ఉపాధి కోసం రుణాలను అందచేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు నుంచి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించిన వెంటనే దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి కోసం మూడు నుంచి ఐదు లక్షల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. రాజీవ్ యువ వికాసం పధకం దరఖాస్తు చేసుకునేందుకు నేటి నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకూ గడువు విధించారు.
ఆరువేల కోట్ల రూపాయలను...
ఇందుకోసం ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ లో కేటాయించింది. ఎలాంటి ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా ఉన్న వారందరూ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అవకాశముంది. తమకు ఉన్న నైపుణ్యతలు, అర్హతలను కూడా దరఖాస్తులలో పొందుపర్చాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అందించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఐదు లక్షలతో చిన్న తరహా వ్యాపారాలను ప్రారంభించుకునే వీలు కల్పించారు. తమ సొంత ఊళ్లోనే డిమాండ్ కు తగినట్లుగా వ్యాపారాలు చేసుకునే వీలుంది. ఇందుకు సంబంధించిన మార్కెటింగ్, అమ్మకం వంటి వాటిపై కూడా ప్రభుత్వం ఎంపికయిన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనుంది.


Tags:    

Similar News