4 గంటల సుదీర్ఘ సమావేశం... కేసీఆర్ స్కెచ్ ఇదే
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో నాలుగు గంటలకు పైగా భేటీ కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో నాలుగు గంటలకు పైగా భేటీ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఉద్యమం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించింది. ఈ నెల 21న టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. అదే రోజున ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించింది. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల పై కేంద్రంపై వత్తిడి తేవాలని నిర్ణయించింది.
టీఆర్ఎస్ ఉద్యమ బాట...
కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఉద్యమబాట పట్టనుంది. ధాన్యం సేకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే, ఇటు పార్లమెంటు ఉభయసభల్లోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను తెలియజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనున్నారు.