Revanth Reddy : త్వరలోనే తెలంగాణలో కొత్త స్పోర్ట్స్ పాలసీ
తెలంగాణలో త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.;
తెలంగాణలో త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్్బి స్టేడియంలో క్రీడల కంటే రాజకీయ సభలే ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి కొత్త విధానం తెస్తామన్న రేవంత్ రెడ్డి బీసీసీఐ తో మాట్లాడి ఎక్కువ క్రికెట్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరిగేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ కు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా కేటాయించామని తెలిపారు.
హర్యానా విధానాన్ని...
అలాగే టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు ఎలాంటి విద్యార్హత లేకున్నప్పటికీ గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో నూతన స్పోర్ట్స్ పాలసీని తెచ్చేందుకు హర్యానా విధానాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ లో మరో స్టేడియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. యూసఫ్ గూడ, సరూర్ నగర్, గచ్చిబౌలి స్టేడియాల్లో క్రీడలు తగ్గాయని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.