Revanth Reddy : బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు ఖాయం

పదేళ్ల పాటు మోదీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2024-04-25 06:59 GMT

revanth reddy

పదేళ్ల పాటు మోదీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంబానీ, అదానీలకు మాత్రమే ఆయన ఉపయోగపడ్డారన్నారు. బీజేపీ సర్కార్ పై గాంధీభవన్ లో నయవంచన పేరుతో కాంగ్రెస్ ఛార్జిషీటు విడుదల చేసిన సందర్భంలో ఆయన మాట్లాడారు. పత్రి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని చెప్పిన మోదీ మాట తప్పారన్నారు. అగర్ బత్తీలను కూడా వదలకుండా జీఎస్టీని విధించారన్నారు. ఉద్యోగాలిస్తామని చెప్పి యువతను మోదీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తుల మొత్తాన్ని అదానీకి అప్పగించిందన్నారు. గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేశారన్నారు. పెట్రోలు ధరలు పెరిగిపోయి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

అప్రమత్తంగా ఉండండి...
రిజర్వేషన్లు రద్దుచేసే కుట్ర కూడా జరుగుతుందని ఆయన అన్నారు. రైతులకు పార్లమెంటు సాక్షిగా మోదీ క్షమాపణలు చెప్పారన్నారు. పిల్లలు వాడే పెన్సిల్ మీద కూడా జీఎస్టీ వేసి దోచుకునే ప్రయత్నం చేశారన్నారు. రాజ్యాంగంపై బీజేపీ ఆఖరి యుద్ధం ప్రకటించిందన్నారు. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తారన్నారు. దేవుళ్లను, మతాలను అడ్డంపెట్టుకుని రాజకీయాలుచేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసే ఆలోచన బీజేపీ చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని, మీ హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.


Tags:    

Similar News