Revanth Reddy : ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తాం.. అందరికంటే ముందుగానే

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Update: 2024-08-01 06:41 GMT

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తీర్పు రావడంతో ఆయన దీనిపై స్పందించారు. తాము ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తనతో పాటు మంత్రి వర్గ సహచరులు ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చి...
దేశంలోనే వర్గీకరణను అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకూ విడుదల చేసిన ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల విషయంలోనూ వర్గీకరణను అమలు చేస్తామని తెలిపారు. అవసరమైతే ఆర్డినెన్స్ ను తెచ్చి వర్గీకరణను అమలు చేస్తామని తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణను అమలు చేసే బాధ్యత తమపై ఉందని తెలిపారు. మాదిగ సోదరులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News