Telangana : తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంథ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చర్చించింది. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలపై సభ్యుల అభిప్రాయాలను తెలుసుకుంది. జరిగిన సంఘటన దురదృష్టకరమని అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి...
అదే సమయంలో ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థికసాయాన్ని ఫిలిం చాంబర్ అందించాలని కూడా నిర్ణయించారు. ఇందుకు సభ్యుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేయాలని కూడా సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now