Breaking : అమర్ రాజా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అమర్ రాజా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది
శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక బ్యాటరీ కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదం జరిగిన సమాచారాన్ని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. బ్యాటరీ కంపెనీకి చెందిన మూడో అంతస్థులు మంటలు వ్యాపించినట్లు తెలిసింది.
కారణాలు మాత్రం...
అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మూడో అంతస్తు నుంచి మంటలు చెలరేగడంతో ఉద్యోగులంతా భయపడి బయటకు పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న అమర్ రాజా కంపెనీలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై ఇంకా అధికారులు సమాచారం అందించలేదు.మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now