Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అభ్యర్థుల ఎంపికపై

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొంటారు;

Update: 2024-03-13 02:07 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన పార్టీ నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే జాతీయ స్థాయిలో అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధినాయకత్వం విడుదల చేస్తుంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది.

అభ్యర్థుల ఎంపికపై...
తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గానూ ఉండటంతో ఆయనకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో నేడు ఢిల్లీ వెళ్లి పార్టీ అభ్యర్థులపై చర్చించి తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే తెలంగాణలోనూ కొందరు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన రాజకీయంగా పార్టీలో ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News