మోదీకి కేసీఆర్ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను ఆదుకోవాలని లేఖలో కోరారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను ఆదుకోవాలని లేఖలో కోరారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడకిల్ విద్యార్థులు చదువు కొనసాగించేకందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దాదాపు ఇరవై వేల మంది ఉక్రెయిన్ విద్యార్థుల్లో 700 మంది తెలంగాణ విద్యార్థులున్నారని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.
చదువు కొనసాగేలా....
వారి మెడికల్ చదువును ఇక్కడ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న మెడికల్ కళాశాలలో వారికి సీట్లు కేటాయించాలని కోరారు. వారి చదువుకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ లేఖలో మోదీని కోరారు. వారిపట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.