Revanth Reddy : నేడు ఢిల్లీలో రేవంత్ ఎంపీలతో సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు.;

Update: 2024-11-26 02:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను తెచ్చే విధంగా పార్లమెంటు సమావేశాల్లో ప్రయత్నించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులతో పాటు ప్రకటించిన ప్రాజెక్టులను కూడా సత్వరం గ్రౌండ్ అయ్యేలా ఎంపీలు ప్రయత్నించేలా చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు.

కేంద్ర మంత్రులను కలసి...
దీంతో పాటు ఈరోజు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది. అపాయింట్ మెంట్ లభించిన మంత్రులను కలసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. నిన్ననే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి నేడు కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ముఖ్యంగా కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును కలసి తెలంగాణకు కొత్తగా నాలుగు ఎయిర్ పోర్టులను మంజూరు చేయాల్సిందిగా కోరనున్నారు.


Tags:    

Similar News