వామ్మో చలి ఇంకా తగ్గలేదే

తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది.

Update: 2023-02-05 02:38 GMT

తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో ప్రజలు వణికిపోతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉదయాన్నే ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.

అత్యల్ప డిగ్రీలు...
సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది. సిద్ధిపేట జిలా్లలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, లంబసింగిలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


Tags:    

Similar News