మరో మూడు రోజులు చలిగాలులే

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది.

Update: 2022-11-30 04:06 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. ప్రధానంగా ఉదయం వేళ మంచు కురుస్తూ వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ఏర్పడిన అధిక పీడన ప్రభావంతో చలిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

పిల్లలు, వృద్ధులు...
మరో మూడు రోజుల వరకూ ఈ చలిగాలుల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ చలిగాలుల ప్రభావంతో వ్యాధులు కూడా వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు చలిగాలులకు దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. లేకుంటే వ్యాధులు బారిన పడే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News