Revanth Reddy : రేవంత్ రెడ్డికి పార్టీ మరో రెస్పాన్స్‌బులిటీ... ఇందులో విజయం సాధిస్తే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మరో కీలక బాధ్యతలను అప్పగించింది.;

Update: 2024-01-07 02:58 GMT

congress party has entrusted telangana chief minister revanth reddy with another key responsibility

Congres Telangana LS elections:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మరో కీలక బాధ్యతలను అప్పగించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తుంది. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తుంది. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకుంటుంది. రానున్న లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకం కావడంతో ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఛైర్మన్ గా...
అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా నియమించింది. ఈయనతో పాటు మొత్తం కమిటీలో ఇరవై మందికి చోటు కల్పించారు. ఈ కమిటీలో అన్ని సామాజికవర్గాలకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా కమిటీలో పార్టీ అనుబంధ సంఘాల నేతలకు కూడా అవకాశం కల్పించారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా యువజన కాంగ్రెస్ తో పాటు ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ అధ్యక్షులను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే కమిటీ...
అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి, సభ్యులుగా మల్లు భట్టి విక్రమార్క, తాటిపర్తి జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, వి.హనుమంతరావు, వంశీ చందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, మధు యాష్కి, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ప్రేమ్ సాగర్ రావు, పొదెం వీరయ్య, సునీతారావులను నియమించారు.


Tags:    

Similar News