స్వాతి నక్షత్రం రోజున గుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్టకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
యాదగిరిగుట్టకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉచిత దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు చెబుతుున్నారు. నిన్న, ఈరోజు సెలవులు కావడంతో భక్తుల రద్దీ యాదగిరిగుట్టలో ఒక్కసారిగా పెరగడంతో అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
గిరిప్రదిక్షిణలు చేస్తూ...
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో అనేక మంది భక్తులు పాల్గొంటారు. గిరి ప్రదిక్షిణలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య కూడా పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో భజనలు, కోలాటాలతో యాదగిరి గుట్ట సందడిగా మారింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ