Telangana : నేడు సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దల భేటీ
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ కానున్నారు
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు సిఎం రేవంత్ తో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్ తో పాటు నిర్మాతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొంటారు.
వివిధ అంశాలపై చర్చ...
సంధ్య థియేటర్లో ఘటన, తరువాతి పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సంక్రాంతి కి విడుదలయ్యే సినిమాలకు మొదటి వారం టికెట్ల పెంపు పై ముఖ్యమంత్రి నీ ఒప్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సంథ్య థియేటర్ లో జరిగిన ఘటనల వల్ల తలెత్తిన పరిణామాలు సినిమా రంగానికి ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది..
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ