Dharani Vs Bhumatha: ధరణి స్థానంలో భూమాత.. చేయబోయే మార్పులు ఇవేనా?

పోర్టల్ అమలును పర్యవేక్షించడానికి, మార్గనిర్దేశం చేయడానికి

Update: 2024-09-14 05:31 GMT

ధరణి పోర్టల్ కార్యకలాపాలను మూల్యాంకనం చేయడానికి, దాని లోపాలను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ దాని స్థానంలో భూమాత పేరుతో కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ (RoR) పోర్టల్‌ను ప్రతిపాదించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ సంస్థ ధరణి పోర్టల్‌కు నిర్వహించిందని, అయితే అందుకు భిన్నంగా కొత్త భూమాత పోర్టల్ నిర్వహణను ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలని కమిటీ సిఫార్సు చేసింది.

భూమాత పోర్టల్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), తెలంగాణ ఆన్‌లైన్ (TG ఆన్‌లైన్) వీటిలోని ప్రభుత్వ సంస్థల్లో ఒకదాని ద్వారా పర్యవేక్షించాలని కమిటీ సూచించింది. పోర్టల్ అమలును పర్యవేక్షించడానికి, మార్గనిర్దేశం చేయడానికి చట్టం, భూమి హక్కు, రెవెన్యూ సంబంధించి సాఫ్ట్‌వేర్‌ నిపుణులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ధరణిలో అనధికారిక కార్యక్రమాలు జరిగితే మూడో పార్టీ ద్వారా తనిఖీ చేయాలని కూడా సూచించింది. ఇక భూ సమస్యల పరిష్కారం, చట్టంలో మార్పులకు కొత్త రెవెన్యూ చట్టం, భూ పరిపాలనా సంస్కరణల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కమిటీ కోరింది.


Tags:    

Similar News