అపోహలొద్దు.. నా మాట వినండి : కామారెడ్డి కలెక్టర్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని చెప్పారు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అరవై రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఇది ఫైనల్ కాదని తెలిపారు. ఇది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమేనని అని ఆయన అన్నారు. రైతులు, పార్టీల నేతలు అర్థం చేసుకోవాలని అన్నారు. అందరి అభిప్రాయాలను స్వీకరిస్తామని తెలిపారు. రైతులకు పూర్తి హక్కు ఉందని, అభ్యంతరాలను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క అభ్యంతరాన్ని సమగ్రంగా పరిశీలిస్తామని చెప్పారు.
ఎవరి భూమినీ తీసుకోం...
మాస్టర్ ప్లాన్ పై ఉన్న అపోహలను వీడాలని ఆయన కోరారు. ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని, కౌన్సిల్ లో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారన్నారు. ఈ నెల 11వ తేదీ వరకూ కామరెడ్డి పురపాలక సంఘ కమిషనర్ కు తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చనని తెలిపారు. దీనిపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముసాయిదా ప్రకటన అన్ని చోట్లా చేశామని అన్నారు. ఎవరి భూములను తాము బలవంతంగా తీసుకోవడం లేదన్నారు. 2000లోనే ఈ ప్రతిపాదన వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కొత్తగా భూములు ఎవరివీ పోవని తెలిపారు. మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పూర్తి పారదర్శకంతో పని చేస్తున్నామని తెలిపారు.