President : నేడు రాష్ట్రపతి ఎట్ హోం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం వచ్చారు. రాష్ట్రపతి నేడు ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం వచ్చారు. రాష్ట్రపతి నేడు ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పౌరులతో ఆమె ఎట్ హోం కార్యక్రమాన్ని నేడు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, విపక్ష నేతలు కూడా హాజరయ్యే అవకాశముంది.
రేపు ఢిల్లీకి...
రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు ఉదయం పది గంటలకు చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీని సందర్శిస్తారు. అనంతరం కోటి మహిళ కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది పాల్గొంటారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రాష్ట్రపతి రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.