KTR : కేసులకు భయపడే ప్రసక్తి లేదు

కేసుల విషయంలో భయపడే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-12-19 15:41 GMT

కేసుల విషయంలో భయపడే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతోనే ఈ కేసులను పెడుతున్నారన్నది అందరికీతెులుసునని అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈరేసుపై చర్చకు తాను అసెంబ్లీలో పట్టుబట్టినా చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ అంటే ఏంటో కూడా తెలియదన్నారు. ఏదో కేసుపెట్టాలనే శాడిస్ట్ మెంటాలిటీ తప్ప మరొకటి కాదన్నారు. ఇండియాలో కార్ రేసింగ్ రావాలని చాలా ప్రయత్నాలు గతంలో జరిగాయని, 2001లో ఫార్ములా వన్ రేస్ ను చంద్రబాబు తేవాలని ప్రయత్నించారన్నారు. నాడు ఫార్ములా వన్ రేస్ పర్మినెంట్ ట్రాక్ కోసం గోపన్నపల్లిలో 583 ఎకరాలకు జీవో కూడా ఇచ్చారన్నారు. గోపన్న పల్లిలో రేవంత్ రెడ్డికి పదిహేను ఎకరాల భూమి ఉందని, మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అఫడవిట్ లో చూపించారన్నారు.

బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు...
దేశ వ్యాప్తంగా ఉన్న పోటీలో ఉన్న భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ఫార్ములా ఈ రేస్ ను ఎంపిక చేశామని కేటీఆర్ తెలిపారు. ఆనంద్ మహేంద్ర నుంచి సచిన్ టెండూల్కర్, సినీ ప్రముఖులు కూడా రేస్ ను చూడటానికి హైదరాబాద్ కు వచ్చారన్నారు. రేస్ ఫిబ్రవరి 2023లో జరిగిందని తెలిపారు. హెచ్ఎండీఏ యాక్ట్ లో హైదరాబాద్ లో ఏ యాక్టివిటీ జరిగినా ఖర్చు పెట్టాలని ఉందన్నారు. ఈ రేస్ వల్ల 82 మిలియన్ డాలర్ల ప్రయోజనం హైదరాబాద్ నగరానికి వచ్చిందన్నారు. హైదరాబాద్ పేరు దేశంలో మారుమోగిందన్నారు. యాభై ఐదు కోట్ల రూపాయలను రెండు వాయిదాల్లో కట్టామన్నారు.ఆ డబ్బులు కట్టడంవల్లనే మనకు రేస్ మిగిలిందన్నారు. ఎన్నికలు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి రేస్ నిర్వాహకుడు అల్ బర్టో కలిశారన్నారు. వచ్చేమూడు సంవత్సరాలకు కూడా ఫార్ములా ఈ రేస్ ను ఇక్కడ నిర్వహించాలని కోరుతూ ఆయన దానకిశోర్ కు లేఖ రాశారని కేటీఆర్ తెలిపారు.
భయపటేడు లేడు...
ఈ ఫార్ములా రేసులో డబ్బులు చెల్లించడంలో అవినీతి ఎక్కడ జరిగిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ వాళ్లు పంపిన ఈ మెయిల్స్ ను కూడా ఆయన మీడియా ఎదుట ప్రదర్శించారు. ఇంత అద్భుతమైన రేస్ ను హైదరాబాద్ కు రానివ్వకుండా చేసినందుకు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు. ఫార్ములా ఈ కంపెనీ వాళ్లు కూడా అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకునందుకు కేసు పెట్టారన్నారు. ఇందులో కరప్షన్ఎక్కడ? కాకరకాయ? ఎక్కడ? అని కేటీఆర్ ప్రశ్నించారు. మెడ మీద తలకాయ ఉన్న వారు ఎవరైనా కేసు పెడతారా? అని నిలదీశారు. ఉద్యమ నాయకుడి బిడ్డలకు తాము భయపడబోమని, ఏం చేసుకుంటావో చేసుకోమని కేటీఆర్ సవాల్ విసిరారు. తాను తప్పు చేయలేదని, అందుకే తాను ఆత్మవిశ్వాసంతో చెబుతున్నానని కేటీఆర్ అన్నారు. తన వెంట ఎందుకు పడుతున్నవో ప్రజలకు తెలుసునని కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News