Telangana : నేటి నుంచి ఏడుపాయల జాతర
నేటి నుంచి తెలంగాణలో ఏడుపాయల జాతర ప్రారంభం కానుంది.;

నేటి నుంచి తెలంగాణలో ఏడుపాయల జాతర ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లిలోని ఏడుపాయల జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. శివరాత్రి ప్రారంభమయ్యే ఈ జాతరకు దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి...
ఈరోజు మంత్రి దామోదర రాజనరిసింహ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం జాతరను ప్రారంభిస్తారు. ప్రతి ఏటా జరిగే ఈ జాతరను చూసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శివరాత్రికి భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకుని శివదీక్షలు చేపడతారు. మూడు రోజుల పాటు ఈ జాతర జరగనుంది.