Breaking : గడ్డం వివేక్ పై ఈడీ కేసు నమోదు.. 200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయంటూ

మాజీ ఎంపీ, కాంగ్రెస్ చేర్యాల అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు

Update: 2023-11-22 13:45 GMT

మాజీ ఎంపీ, కాంగ్రెస్ చేర్యాల అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను జరిపినట్లు గుర్తించామని తెలిపారు.యాశ్వంత్ రియాలిటీతో పాటు గడ్డం వివేక్ భార్య పేరిట కూడా భారీగా కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని తెలిపారు.

ఆయన భార్య పేరిట...
భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులుతెలిపారు. ఫెమా చట్టం కింద మాజీ ఎంపీ వివేక్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విజిలెన్స్ సెక్యూరిటీ ద్వారా ఎలాంటి వ్యాపారం లేకపోయినా పెద్దయెత్తున లావాదేవీలు జరిగాయని అన్నారు. నకిలీ పత్రాలతో ఆస్తులను కొనుగోలు చేశారన్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటి వరకూ 20 లక్షల ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News