Telangana : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై మాజీ సీఎం కేసీఆర్ ఏమన్నారంటే?
తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని నేడు సచివాలయంలో ఆవిష్కరణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు
తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని నేడు సచివాలయంలో ఆవిష్కరణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. నాటి సమైక్య పాలకుల మరిపింపులో మరిచిపోయిన తెలంగాణ ప్రతీకలను తెలంగాణ ఉద్యమ సమయంలో పునరుజ్జీవింప చేసుకోవడానికి నిలుపుకున్న మాతృరూపమే తెలంగాణ తల్లి. ఇదీ తెలంగాణ తల్లి ఆవిర్బావ చరిత్ర అని అన్నారు.
చారిత్రక నేపథ్యం ఉన్న...
ఈ చారిత్రక నేపథ్యం తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించిన కనీస సోయిలేని నేటి కాంగ్రేస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనే తలతిక్క ఆలోచనలతో తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెచ్చే ప్రమాదాన్ని తెస్తున్నారు.ఇది వొక పద్దతి పాడులేని ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తిర్రి మొర్రి వ్యవహారం. మూర్ఖపు వైఖరికి నిదర్శనం’’ అని కేసీఆర్ అన్నారు.