నాలుగేళ్ల మెట్రో సేవలు
హైదరాబాద్ మెట్రో కు నాలుగేళ్లు పూర్తయింది. మెట్రో రైలు ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బాగా ఉపయోగపడింది.
హైదరాబాద్ మెట్రో కు నాలుగేళ్లు పూర్తయింది. మెట్రో రైలు ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలు బాగా ఉపయోగపడింది. 2017 నవంబరు 28న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించారు. దశల వారీగా విస్తరించిన మెట్రో సేవలు నగరవాసులకు ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తం మూడు మార్గాల్లో 69.2 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలును అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
నాలుగు దశల్లో....
నాలుగు దశల్లో విస్తరించిన మెట్రో రైలులో రోజుకు 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ మెట్రో రైలు వేళలను పొడిగించారు. మెట్రో రైలు సురక్షితంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుండటంతో నగరవాసులు మెట్రో రైలు మీదనే ఆధారపడుతున్నారు.