బాలికల విద్యాలయంలో ఫుడ్ ఇన్‌ఫెక్షన్
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ ఇన్‌ఫెక్షన్ తో తొమ్మిది మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో విద్యార్థినులు అవస్థలు పడుతుండటంతో వెంటనే అధికారులు వారిని ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రికి తరలింపు...
రంగారెడ్డి జిల్లా మంచాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఘటన జరిగిదంి. మొత్తం 9 మంది విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నార్మల్ గానే ఉందని అధికారులు తెలిపారు. ఫుడ్ పాయిజినింగ్ ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు.