పెరుగుతున్న గోదావరి ఉధృతి
గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు
గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద నీటిమట్టం ప్రస్తుతం 58 అడుగులకు చేరుకుంది. పై నుంచి 20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని 68 అడుగులకకు ేరే అవకాశముందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
పెరుగుతున్న వరద ఉధృతి...
ముంపు ప్రాంతాల ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన కోరారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పక పాటించాలన్నారు. మేడిగడ్డ నంుచి ఇన్‌ఫ్లో పెరుగుతుందని అవసరమైతే మరింత మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎవరూ భద్రాచలం పర్యటనకు రావొద్దని ఆయన కోరారు. ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.