భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతుంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు

Update: 2022-08-17 05:23 GMT

గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతుంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 54.5 అడుగులకు చేరుకోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే పలు మండలాల్లో వరద నీరు చేరిపోయింది. దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరించే కార్యక్రమాన్ని చేపట్టారు.

నీట మునిగిన గ్రామాలు...
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరిలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. స్నానాలకు కూడా దిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వెంకటాపురం, చర్ల, వాజేడు, మండలాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కనూరు, వేలేరు పాడు మండలాల్లో అనేక గ్రామాలకు వరద నీరు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై అనని చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News