గ్యాంగ్ రేప్ కేసుపై గవర్నర్ ఆరా

బాలిక గ్యాంగ్ రేప్ కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు;

Update: 2022-06-05 06:04 GMT
గ్యాంగ్ రేప్ కేసుపై గవర్నర్ ఆరా
  • whatsapp icon

జూబ్లీహిల్స్ లోని బాలిక గ్యాంగ్ రేప్ కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలను చూసిన గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తనకు రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీని గవర్నర్ ఆదేశించారు.

రెండు రోజుల్లో.....
జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ లో బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గవర్నర్ తమిళి సై కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనలో ఎవరు? పాల్గొన్నారన్న దానిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News