Supreme Court : ఓటుకు నోటు కేసు వాయిదా

ఓటుకు నోటు కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలంటూ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.;

Update: 2024-04-18 07:58 GMT
murder, doctor, supreme court, kolkata

telangana government, relief, supreme court, mlcs

  • whatsapp icon

ఓటుకు నోటు కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. దీంతో ఓటుకు నోటు కేసు జులై 24న విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించిన వివరాలను అందించేందుకు సమయం కోరినందున వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం నుంచి...
రెండు వారాల అనంతరం కోర్టుకు ఎటూ వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి ఆ తర్వాతనే విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరడంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం పేర్కొంది. దీంతో జులై చివరలో ఈ విచారణ చేపట్టే అవకాశముది.


Tags:    

Similar News