విద్యాసంస్థలకు సెలవు.. ఎప్పటి వరకూ అంటే
తెలంగాణలోనూ, హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తూ ఉంది. దీంతో ప్రభుత్వం
భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు సెలవు ఉంటుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. తెలంగాణలోనూ, హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తూ ఉంది. దీంతో ప్రభుత్వం పాఠశాలలకు ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించింది. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. సియర్ సూన్, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చాయని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురు, శుక్ర, శనివారాల్లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, యాదాద్రి, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, భూపాలపల్లి, మేడ్చల్, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి , మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల , పెదపల్లి, మంచిర్యాల , ఆదిలాబాద్ , జయశంకర్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.