Telangana : తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్ ఏడుగురు మావోల మృతి
తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.;

తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. ములుగు జిల్లాలోని చల్పాక సమీపంలోని అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం. మావోయిస్టులు సమావేశమవుతున్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తరుణంలో మావోలు ఎదురుపడగా ఇద్దరి మధ్య కాల్పులు జరిగాయి.
కీలక నేత ఉన్నట్లు...
ఈ భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. మరణించిన మావోయిస్టులలో కీలక నేత ఒకరు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా నిర్ధారించలేదు. వారం రోజుల క్రితం ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరిని మావోయిస్టులు నరికి చంపిన నేపథ్యంలోనే ఈ ఎన్ కౌంటర్ జరిగినగ్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.