Big Breaking: నాంపల్లి కోర్టులోనే అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు విషయంలో నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు న్యాయమూర్తి విచారిస్తున్నారు. అర్జున్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు.ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి అల్లుఅర్జున్ తరుపున న్యాయవాదుల వాదనలు వింటున్నారు.
ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరూ అక్కడకు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే చంచల్ గూడ జైలు వద్ద కూడ భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించాల్సివస్తే ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.