మంచుదుప్పట్లో తెలంగాణ

తెలంగాణలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం పది గంటలైనా సూర్యుడు రాకపోవడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.

Update: 2022-12-03 03:44 GMT

తెలంగాణలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం పది గంటలైనా సూర్యుడు రాకపోవడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భయపడిపోతున్నారు కూడా. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముంద్రలో ఈ నెల 4న ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో డిసెంబరు 5న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఏజెన్సీ ప్రాంతాల్లోనూ...
హైదరాబాద్ నగరంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక మంచు దుప్పటి కప్పుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పట్టపగలే లైట్లు వేసుకుని నిదానంగా వాహనాలు ప్రయాణించాల్సి ఉంటుంది. మరో ఐదురోజుల పాటు తెలంగాణలో ఇదే పరిస్థిితి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్ లో 13.7 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో 21, భద్రాచలంలో 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


Tags:    

Similar News