భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద నీటిపారుదల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు

Update: 2024-07-30 04:34 GMT

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాద స్థాయి కి దిగువకు వచ్చిందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్న కొద్ది గంటల్లోనే నీటి మట్టం మళ్ళీ పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో తగిన చర్యలు ప్రారంభించారు.

ఎగువన కురుస్తున్న....
భద్రాచలం వల్ల నీటి మట్టం 43 అడుగులు దాటి ప్రవహిస్తుండటంతో తిరిగి మొదటి ప్రమాద హెచ్చరికను నీటి పారుదల శాఖ అధికారులు జారీ చేశారు..సాయంత్రం వరకూ మరో రెండు,మూడు అడుగులు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు మళ్లీ నీటిమట్టం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News