వణుకుతున్న జనం.. చలితో భయం
తెలంగాణలో చలి పెరుగుతోంది. ఒక్కసారిగా చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
తెలంగాణలో చలి పెరుగుతోంది. ఒక్కసారిగా చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ బయటకు రావడానికే భయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ ఇదే పరిస్థితి. రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో నిన్న అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సంగారెడ్డి జిల్లా సత్వార్ లో 9.1 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.
సీజనల్ వ్యాధులు...
చలిగాలులతో ప్రజలు భయపడి పోతున్నారు. మార్నింగ్ వాక్ కు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. రానున్న రెండు మూడు రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు.