Breaking : కవిత రిమాండ్ పొడిగింపు.. తీహార్ జైలులోనే బీఆర్ఎస్ నేత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో పూర్తయింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో పూర్తయింది. దీంతో కల్వకుంట్ల కవితను నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశించారు. మరో పథ్నాలుగు రోజుల పాటు కవితను జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించారు. ఈ నెల ఇరవై మూైడో తేదీ వరకూ రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్ పొడిగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై కూడా నేడు విచారణ ప్రారంభం కానుండటంతో ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ తరుపున న్యాయవాదులు కోరారు. న్యాయస్థానంలో కవిత మాట్లాడేందుకు రెండు నిమిషాలు అనుమతిని ఆమె తరుపున న్యాయవాది కోరారు. అందుకు న్యాయస్థానం తిరస్కరించింది.
కుటుంబ సభ్యులతో ...
కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించాలని కోరారు. న్యాయమూర్తి అనుమతితో కవిత కుటుంబ సభ్యులను కలిశారు. కవిత కస్టడీని పొడిగించేందుకు ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కవిత తరుపున న్యాయవాదులు కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో అరెస్టయిన కల్వకుంట్ల కవితను పది రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో మార్చి 26వ తేదీ నుంచి కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో అధికారులు తిరిగి ఆమెను తీహార్ జైలుకు తరలించనున్నారు.