కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవం
నిజమాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.;
నిజమాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోట ీ చేసిన శ్రీనివాస్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించడంతో కవిత ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. అధికారులు మరికాసేపట్లో ప్రకటించే అవకాశముంది.
స్వతంత్ర అభ్యర్థి....
కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ లు పోటీ చేయలేదు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ ఒక్కరే నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్ పత్రాల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఎంపీటీసీ, కార్పొరేటర్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన అధికారులు శ్రీనివాస్ నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.