గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కి కోలుకోలేని దెబ్బ..!!

కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంప ముంచ బోతోందా...!!?? ముచ్చటగా;

Update: 2024-09-14 09:15 GMT
BRS MLA Kaushik Reddy, Kaushik Reddys comments, whether BRS will lose ground in Hyderabad Greater Elections,  telangana 2024 Hyderabad Greater Elections, telangana political news, hyderabad  latest news today, GHMC elections

 BRS MLA Kaushik Reddy

  • whatsapp icon

కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంప ముంచ బోతోందా...!!?? ముచ్చటగా మూడోసారి తెలంగాణ లో అధికారాన్ని అధిరోహిస్తామని ధీమా వ్యక్తం చేసి, కాంగ్రెస్ అసలు తమకు పోటీ యే కాదు అని భావించిన బీఆర్ఎస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో చతికిల పడి,ప్రతి పక్ష హోదా తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది...!!

ఆ ప్రతిపక్ష హోదా రావడానికి కారణం కూడా... హైదరాబాద్, మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరియు ఆంధ్రా సెటిలర్స్...

ఈ విషయాన్ని ఎన్నో సార్లు పార్టీ లో కీలక నేత, మరియు పార్టీ అధినేత కుమారుడు అయిన కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) ఎన్నో సార్లు బహిర్గతంగా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు..!!

ఇందులో ఎటువంటి అనుమానం లేదు...!! కానీ ఇటీవల పార్టీ తరపున గెలిచిన నాయకుల వల్ల, ఆ సెటిలర్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ కి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి...!!

స్వయంగా ఆ పార్టీ నేత, హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలు..ఈ ప్రతిపాదన కి మరింత ఊపు నిస్తున్నాయి..

ఆ ఎమ్మెల్యే.. తనకి మరియు శెరిలింగం పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి మధ్య జరిగిన వివాదంలో... కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ కి బతుకు తెరువు కోసం వచ్చిన నువు.. తెలంగాణ లో పెత్తనం చెలాయించాలని చూస్తున్నావు అని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ పార్టీ ని ఇరకాటంలో పడేసారు..!!

నిజానికి తను చేసిన వ్యాఖ్యలు అరికెపూడి గాంధీ ని ఉద్దేశించి చేసినవే అయినా... హైదరాబాద్లో సెటిలర్స్ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి..

ఈ విషయం గుర్తించిన పార్టీ అధిష్టానం, దిద్దుబాటు చర్యలను ప్రారంభించి, శుక్రవారం ఆ విధంగా వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే,పాడి కౌశిక్ రెడ్డి తో ప్రెస్ మీట్ పెట్టించి,

తాను చేసిన వ్యాఖ్యలు కేవలం గాంధీని ఉద్ధేశించి మాత్రమే చేసినవి, సెటిలర్స్ అంటే తనకి తమ అధినేత కేసీఆర్ లాగే ఎంతో గౌరవం అని చెప్పించినా కూడా..... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది...

సరైన సమయంలో..ఈ పరిస్తితి ని తనకు అనుగుణంగా మర్చుకోనే ప్రయత్నం లో... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..."" సెటిలర్స్ కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికి వస్తారా..!!??

ఎన్నికల్లో పోటీ చేసేందుకు పనికి రారా...!!?? "" అని అగ్గికి ఆజ్యం పోసినట్లు ఒక స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు..!!

నిజంగా బీఆర్ఎస్ సెటిలర్స్ మనోభావాలకు గౌరవం ఇచ్చే విధంగా నడుచుకునే పార్టీ అయితే... పాడి కౌశిక్ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు...!!

Tags:    

Similar News