అక్కడ మందిరం మాత్రమే కాదు మసీదు, చర్చ్ కూడా కడుతున్నాం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ సముదాయంలో ఆలయాన్ని నిర్మిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. మసీదు, చర్చితో పాటు ఖచ్చితంగా ఆలయాన్ని నిర్మిస్తామని ఆదివారం నాడు హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ సముదాయంలో ఆలయాన్ని నిర్మిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. మసీదు, చర్చితో పాటు ఖచ్చితంగా ఆలయాన్ని నిర్మిస్తామని ఆదివారం నాడు హామీ ఇచ్చారు. పనులు జరుగుతున్న సమయంలో కూల్చివేసిన ఆలయ నిర్మాణ పురోగతిపై మంత్రిని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన టీడీపీ మాజీ నేత చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. ఆలయం, మసీదు, చర్చి.. ఈ మూడింటిని తప్పకుండా నిర్మిస్తాం.. మీరేం ఆందోళన చెందకండి అని కేటీఆర్ సూచించారు. అన్ని మతాలను గౌరవించే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉందన్నారు. మతం ముసుగులో రాజకీయాలు చేయమని పేర్కొన్నారు.
"మందిర్ భీ బనేగా, మస్జిద్ భీ బనేగా ఔర్ చర్చ్ భీ బనేగా! ఆప్ బేఫికర్ రహియే !! మతం ముసుగులో రాజకీయాలు చేయని, అన్ని విశ్వాసాలను సమానంగా గౌరవించే #కేసీఆర్ నాయకత్వంలో ఇది తెలంగాణ" అని ట్వీట్ చేశారు. గతేడాది పాత సెక్రటేరియట్ భవనాల కూల్చివేత సమయంలో రెండు మసీదులు, ఒక దేవాలయం ధ్వంసమైంది. కూల్చివేతపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రార్థనా స్థలాలను మరింత విశాలమైన ప్రదేశాలలో, ప్రభుత్వ ఖర్చుతో పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ హామీలను నెరవేరుస్తూ ఉన్నామని కేటీఆర్ తాజాగా చెప్పుకొచ్చారు.