నేడు తొలిసారి కవిత నిజామాబాద్ పర్యటన
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తొలిసారి నిజామాబాద్ లో పర్యటిస్తున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తొలిసారి నిజామాబాద్ లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత నిజామాబాద్ కు వస్తుండటంతో కవితకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఇందల్వాయి టోల్ గేట్ నుంచ నిజామాబాద వరకూ భారీ ర్యాలీ నిర్వహించడానికి సన్నాహాలుచేస్తున్నారు.
జైలు నుంచి విడుదలయిన తర్వాత...
జైలు నుంచి విడుదలయిన తర్వాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్న కవిత తిరిగి యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఇటీవల ఎండగడుతూ గళం విప్పుతున్నారు. తిరిగి నిజామాబాద్ లో తన పట్టును నిలుపుకునేందుకే కవిత వస్తున్నారని అనుకోవాలి. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసిన అనంతరం కవిత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలను సమీకరించనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now