నేడు గద్దెపైకి సమ్మక్క... మేడారం జాతర రెండో రోజు

ఆదివాసీలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మేడారం జాతరకు తొలిరోజే లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Update: 2022-02-17 03:55 GMT

మేడారం జాతర ప్రారంభమైంది. నేడు సమ్మక్క ను గద్దెపై ప్రతిష్టించనున్నారు. ఆదివాసీలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ జాతరకు తొలిరోజే లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆదివాసీ పూజారులు సారలమ్మ తండ్రి పగిడి గద్దరాజు, భర్త గోవిందరాజులను గద్దె పై ప్రతిష్టించారు. సారలమ్మను కూడా వేలాది మంది భక్తుల సమక్షంలో గద్దెపైకి చేర్చారు. సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనుంది.

జంపన్న వాగులో...
జంపన్న వాగులో భక్తులు స్నానమాచరించి అమ్మవారలను దర్శించుకుంటున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు జాతర ప్రారంభం కావడంతో శుభసూచకంగా భావిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మాఘశుద్ధ పౌర్ణమిరోజున జాతర ప్రారంభమయింది. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. మేడారం జాతరలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.


Tags:    

Similar News