చలో గోవా.. టీఆర్ఎస్ ఎంపీటీసీలు...?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వేడెక్కుతున్నాయి.

Update: 2021-11-30 08:56 GMT

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వేడెక్కుతున్నాయి. కరీంనగర్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తమ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నంలో అధికార పార్టీ పడింది. కరీంనగర్ జిల్లాలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ పార్టీని వీడారు. ఆయనకు కొందరు కార్పొరేటర్లు, ఎంపీటీసీలు మద్దతు ప్రకటిస్తున్నారని అనుమానం కలుగుతోంది.

అనుమానం....
అలాగే ఖమ్మం ఎమ్మెల్సీ పదవి విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో స్తానిక సంస్థల ఓటర్లను అధికార టీఆర్ఎస్ పార్టీ గోవాకు తరలించింది. అక్కడ ినుంచే నేరుగా పోలింగ్ సమయానికి తీసుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు కొందరు పెద్దయెత్తున ఆఫర్లు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.


Tags:    

Similar News